గాలి జనార్దన్ రెడ్డికి ఊరట.. బెయిల్ నిబంధనలు సడలించిన సుప్రీంకోర్టు
- పలు ప్రాంతాల్లో పర్యటనకు అనుమతి కోరిన గాలి
- విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- మూడు ప్రాంతాల్లో పర్యటనకు అనుమతి
- ఎస్పీలకు సమాచారం అందించాలని ఆదేశం
వాదనల సందర్భంగా సీబీఐ... బళ్లారి, కడప, అనంతపురంలో గాలి జనార్దన్ రెడ్డి పర్యటనలకు అభ్యంతరం లేదని తెలిపింది. అయితే బెయిల్ షరతులు పూర్తిగా మార్చవద్దని కోర్టును కోరింది. ఈ కేసులో జనార్దన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహాత్గీ, రంజిత్ కుమార్ వాదించారు.