traffic: రేపు హైద‌రాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు

traffic restrictions in hyd
  • మొహర్రం సందర్భంగా చ‌ర్య‌లు
  • రేపు ఉద‌యం 11 గంట‌ల‌ నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్ష‌లు
  • అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు
మొహర్రం సందర్భంగా రేపు ఉద‌యం 11 గంట‌ల‌ నుంచి రాత్రి 9 గంటల వరకు హైద‌రాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించ‌నున్నారు. రేపు హైద‌రాబాద్‌లోని డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు జ‌ర‌గ‌నుంది.

హైద‌రాబాద్‌లో మొహర్రం సన్నాహాలపై పోలీసులతో హైద‌రాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ వ‌ర్చువ‌ల్ విధానంలో మాట్లాడారు. రేపు హైద‌రాబాద్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చ‌ర్చించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. ప్రజలు క‌రోనా నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని ఆయ‌న అన్నారు. పోలీసులకు ప్ర‌జ‌లు సహకరించాలని కోరారు.
traffic
Hyderabad
Hyderabad Police

More Telugu News