Rajasthan: సెప్టెంబరు 13న చంపేస్తున్నాం.. చేతనైతే రక్షించుకోండి: రాజస్థాన్ జడ్జికి బెదిరింపు లేఖ

Will commit murder on September 13 district judge in Rajasthan received a threatening letter
  • మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు
  • తుపాకితో కాల్చి గానీ, విషమిచ్చి గానీ, వాహనంతో ఢీకొట్టి కానీ చంపేస్తాం
  • పోలీసులకు కూడా ఈ విషయాన్ని చేరవేశాం
  • లేఖలో పేర్కొన్న అజ్ఞాత వ్యక్తి
‘‘మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబరు 13న హత్య చేస్తున్నాం. మీ ఇంటిని బాంబులతో పేల్చేద్దామనుకున్నాను కానీ, మీ కుటుంబ సభ్యుల వల్ల నాకు హాని లేదు కాబట్టి ఆ ఆలోచన విరమించుకున్నా. తుపాకితో కాల్చిగాని, విషమిచ్చి కానీ, వాహనంతో ఢీకొట్టి కానీ.. ఏదో రకంగా మిమ్మల్ని చంపేస్తా. కోర్టులో నిందితుడికి మీరు ఎలా అయితే అవకాశం ఇస్తారో, మేం కూడా రక్షించుకునేందుకు మీకు అవకాశం ఇస్తున్నాం. ఈ విషయమై పోలీసులకూ సమాచారం ఇచ్చాం. చేతనైతే రక్షించుకోండి’’ అంటూ రాజస్థాన్‌లోని బూందీ జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారికర్‌కు అజ్ఞాత వ్యక్తి ఒకరు లేఖ రాశాడు.

హిందీలో రాసిన ఈ లేఖలో జడ్జికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.
Rajasthan
Judge
Tthreatening Letter
Crime News

More Telugu News