చిన్నారులకు టీకా.. రెండు నెలల్లో అందుబాటులోకి: భారత్ బయోటెక్
- రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్
- క్లినికల్ ట్రయల్స్‌లో సంతృప్తికర ఫలితాలు
- కొవిడ్, రేబిస్ రెండింటికీ ఒకే టీకా తెచ్చే యోచన
టీకా పూర్తి భద్రత ఇస్తుందని ఇప్పటికే స్పష్టమైందని, రోగ నిరోధకశక్తి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ టీకాకు సంబంధించి మరో నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. టీకా క్లినికల్ ట్రయల్స్‌పై భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) సంతృప్తి చెందితే టీకాకు అనుమతి లభిస్తుందని, ఇదంతా జరిగేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. అలాగే, కొవిడ్, రేబిస్ రెండింటికీ కలిపి ఒకే టీకా ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.