Anjali: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Anjali considered for a key role in Shankar film
  • శంకర్ సినిమాలో అంజలికి ఛాన్స్ 
  • 'ఆర్ఆర్ఆర్' ఉక్రెయిన్ షూట్ పూర్తి
  • తమిళ రీమేక్ లో అభిషేక్ బచ్చన్  
*  ఇటీవల 'వకీల్ సాబ్' సినిమాలో నటించిన కథానాయిక అంజలి తాజాగా మరో మెగా హీరో సినిమాలో కూడా ఛాన్స్ పొందినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా మూవీలో కీలక పాత్రకు అంజలిని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఉక్రెయిన్ లో ముగిసింది. దీంతో చిత్రం యూనిట్ హైదరాబాదుకు తిరిగివచ్చారు. షూటింగుకు సంబంధించి ఇక నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలివుంది. త్వరలోనే దానిని కూడా పూర్తిచేస్తారు.
*  ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ తమిళ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్నాడు. ప్రతిభన్ దర్శకత్వంలో వచ్చిన 'ఊత్తా సేరుప్పు సైజ్ 7' అనే చిత్రం రీమేక్ హక్కులను అభిషేక్ తీసుకుని, ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ కూడా ప్రారంభించినట్టు సమాచారం.
Anjali
Ramcharan
Rajamouli
Abhishek Bacchan

More Telugu News