National Best Teachers: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికయినవారు వీరే!

National best teachers from Andhra Pradesh and Telangana
  • ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసిన కేంద్రం
  • దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయుల ఎంపిక
  • ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. అవార్డులకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. ఏపీ, తెలంగాణల నుంచి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్టణం లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాయిపల్లి హైస్కూల్ టీచర్ మునిరెడ్డిని ఈ అవార్డులకు ఎంపీక చేశారు. తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ జిల్లా సావర్ ఖేడ్ స్కూల్ ఉపాధ్యాయుడు రంగయ్య, సిద్ధిపేట జిల్లా ఇందిరానగర్ హైస్కూల్ హెడ్ మాస్టర్ రామస్వామి ఎంపికయ్యారు.
National Best Teachers
Awards
Andhra Pradesh
Telangana

More Telugu News