Shashi Tharoor: ఏడున్నరేళ్ల నరకానికి ముగింపు: శశిథరూర్​

Shashi Tharoor Responds On The Court Verdict
  • సునంద ఆత్మహత్య కేసు తీర్పుపై కాంగ్రెస్ ఎంపీ స్పందన
  • తీర్పుతో కారు చీకట్లు తొలగిపోయాయి
  • సునంద ఆత్మ ఇప్పుడే శాంతిస్తుంది
  • ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది
ఏడున్నరేళ్లుగా తాను అనుభవిస్తున్న నరకానికి ఎట్టకేలకు ముగింపు దొరికిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో థరూర్ పై ఉన్న అభియోగాలన్నింటినీ ఢిల్లీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై ఆయన స్పందించారు. జడ్జిలు గొప్ప తీర్పు ఇచ్చారని ఆయన కొనియాడారు. సునంద పుష్కర్ ఆత్మ ఇప్పుడే శాంతిస్తుందని అన్నారు.

‘‘నా భార్య సునంద మరణం తర్వాత ఎంతో కాలం నా చుట్టూ అలముకున్న కారు చీకట్లు ఈ తీర్పుతో తొలగిపోయాయి. ఆమె మరణంపై నా మీద ఎన్నెన్నో నిరాధారపూరితమైన ఆరోపణలను మోపారు. మీడియా ఎన్నో అభాండాలను వేసింది. అయితే, ఇప్పుడు వచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నా నమ్మకాన్ని మరింత పెంచింది. తప్పు చేస్తే మన న్యాయవ్యవస్థ కచ్చితంగా శిక్షిస్తుంది. ఏదిఏమైనా న్యాయం జరిగింది’’ అని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.
Shashi Tharoor
Congress
MP
Sunanda Pushkar

More Telugu News