Tirupati: తిరుపతిలో రూ. 684 కోట్లతో నిర్మిస్తున్న గరుడ వారధి పేరు శ్రీనివాస సేతుగా మార్పు!

Garuda varadhi name Changed as Srinivas varadhi in Tirupati
  • గత ప్రభుత్వ హయాంలోనే గరుడ వారధి నిర్మాణం ప్రారంభం
  • గరుడి పేరుతో ఉన్న వంతెనపై రాకపోకలు తగవన్న స్థానిక ఎమ్మెల్యే
  • మరి శ్రీనివాసుడి పేరు పెట్టడం ఒప్పెలా అవుతుందని ప్రశ్న
తిరుపతిలో రూ. 684 కోట్లతో నిర్మిస్తున్న గరుడ వారధికి శ్రీనివాస సేతుగా నామకరణం చేస్తున్నట్టు నిన్న జరిగిన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అయితే, గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన ఈ వారధి పేరును ఇప్పుడు మార్చడం వివాదాస్పదమైంది. అయితే, అధికారికంగా ఎలాంటి పేరు లేదని స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

స్వామి వారికి గరుడు అత్యంత ప్రీతిపాత్రుడని, కాబట్టి ఆ పేరుతో ఉన్న సేతుపై నుంచి రాకపోకలు సాగించడం భావ్యం కాదనే వారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చుతున్నట్టు వివరించారు. అయితే, ఆయన వ్యాఖ్యలను మరికొందరు తప్పుబడుతున్నారు. గరుడి పేరుతో ఉన్న వారధిపై నడవడం తప్పు అయినప్పుడు స్వామి పేరుతో ఉన్న వంతెనపై నుంచి నడవడం ఒప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. పేరు మార్పు తగదని పేర్కొంటూ టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ సమావేశాన్ని బహిష్కరించారు.
Tirupati
Bridge
Lord Garuda
Lord Srinivasa

More Telugu News