Chandrababu: చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

Kodali Nani controversial Comments on Chandrababu
  • ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపి అంతమొందించాల్సింది
  • అదే జరిగి ఉంటే నేడు గుంటూరు లాంటి ఘటనలు తలెత్తేవి కావు
  • విద్యాకానుక ప్రజల్లోకి వెళ్లకుండా లోకేశ్ నాటకాలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో నిన్న మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందని అన్నారు. అలా జరిగి ఉంటే గుంటూరు లాంటి సంఘటనలు ఇప్పుడు జరిగేవి కాదని అన్నారు. ఎస్సీ మహిళ శవాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 లోకేశ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. విద్యాకానుక కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేశ్ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలన్నదే ప్రభుత్వం అభిమతమని, అందుకనే దిశ చట్టం, యాప్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారని మంత్రి తెలిపారు.
Chandrababu
Kodali Nani
Nara Lokesh

More Telugu News