Allu Arjun: 'పుష్ప' కంటెంట్ లీక్ కావడంపై అల్లు అర్జున్ స్పందన!

Allu Arjun responds after Pushpa content leaked
  • ఆన్ లైన్లో లీకైన 'దాక్కో దాక్కో మేక' పాట
  • సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిత్రబృందం
  • లీక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బన్నీ
  • ఎవరినీ ఫోన్లు తీసుకురానివ్వొద్దని ఆదేశం!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం పుష్ప. అయితే ఇటీవల పుష్ప కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడంతో చిత్రబృందం తీవ్ర అసహనం వెలిబుచ్చింది. దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక పాట విడుదలకు ముందే ఆన్ లైన్ లో వచ్చింది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. లీక్ చేసిన వారిని వదలరాదని, షూటింగ్ స్పాట్ కు, ఎడిటింగ్ రూమ్ కు ఎవరినీ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతించవద్దని చిత్రయూనిట్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అసలు, తన సినిమా కంటెంట్ ఎలా లీకైందంటూ బన్నీ విస్మయానికి గురికావడంతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

కాగా, ఆన్ లైన్ లీక్ పై మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇటీవల రిలీజైన దాక్కో దాక్కో మేక పాటకు యూట్యూబ్ లో వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News