icc: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుద‌ల‌.. చాలా కాలం త‌ర్వాత భార‌త్‌-పాక్ మ్యాచ్‌.. తేదీ ఖ‌రారు

ICC T20 World Cup India to play Pakistan in Dubai on October 24
  • అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టోర్నీ
  • ఒమన్‌తో పాటు యూఏఈలో మ్యాచులు
  • అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌
  • న‌వంబ‌రు 14న ఫైనల్‌ మ్యాచ్ దుబాయ్‌లో
టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ ఈ రోజు విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టోర్నీ నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఈ మ్యాచులు ఒమన్‌తో పాటు యూఏఈలో జ‌ర‌గ‌నున్నాయి. చాలా కాలం త‌ర్వాత భార‌త్-పాక్ క్రికెట్ పోటీలో త‌ల‌ప‌డ‌నున్నాయి.  అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుందని ఐసీసీ ప్ర‌క‌ట‌న చేసింది. నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీ ఫైనల్‌  మ్యాచ్ ఉంటుంద‌ని, అదే నెల‌ 14న ఫైనల్‌ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంద‌ని తెలిపింది.

     
icc
BCCI
Cricket
India
Pakistan

More Telugu News