Manchu Lakshmi: తన ఇల్లు మొత్తాన్ని చూపించిన మంచు లక్ష్మి.. వీడియో ఇదిగో

Manchu Laxmi Home Tour
  • అమెరికాలోని తన ఇల్లు కాలిపోయిందని వెల్లడి
  • ఒక్క పెయింటింగ్ మాత్రమే మిగిలిందన్న నటి
  • అదంటే తనకెంతో ఇష్టమని కామెంట్
మంచి లక్ష్మి తన ఇంటిని ప్రేక్షకులకు చూపించారు. తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి పంచుకున్నారు. అమెరికాలో తన ఇల్లు కాలిపోయిందని చెప్పారు. ఆ ఘటనలో ఒక్క పెయింటింగ్ మాత్రమే మిగిలిందని, అదంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ లో ఇప్పుడుంటున్న ఇంటిని తీసుకున్నట్టు చెప్పారు. సమయం మారేకొద్దీ ఆ ఇంట్లో మార్పులు చేర్పులు చేశానన్నారు.

తనకు పెయింటింగ్స్ అంటే ఎంతో ఇష్టమని ఆమె వివరించారు. తన కూతురుతో కలిసి పెయింటింగ్స్ వేస్తుంటానని, ఎప్పుడూ కథలు చదువుతూ కూర్చుంటానని తెలిపారు. టీ కలెక్షన్స్, ఫొటో కలెక్షన్స్, జ్యువెలరీ, పాదరక్షల కలెక్షన్ వంటి వాటిని ఆమె వివరించారు.

తన ఇంట్లోని డైనింగ్ టేబుల్ కూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, ఎంతో మంది నటులు, రాజకీయ ప్రముఖులు దానిపై భోజనం చేశారన్నారు. అందుకే దానిని చాలా భద్రంగా చూసుకుంటున్నానని ఆమె వివరించారు. యూట్యూబ్ లో ఆమె తన చానెల్ లో ఆ హోం టూర్ వీడియోను పోస్ట్ చేశారు. మీరూ, చూసేయండి మరి.

Manchu Lakshmi
Home
Tollywood

More Telugu News