హైతీలో విరుచుకుపడిన భారీ భూకంపం.. 300 మందికిపైగా మృతి
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- రిక్టర్ స్కేలుపై 7.2గా తీవ్రత
- దేశంలో నెల రోజులపాటు అత్యవసర పరిస్థితి
- సాయానికి ముందుకొచ్చిన అమెరికా
భూకంపం దాటికి దేశంలోని పలు చోట్ల వేలాది ఇల్లు కుప్పకూలాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. రంగంలోకి దిగిన విపత్తు, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఏరియల్ సర్వే నిర్వహించిన హైతీ నూతన ప్రధాని హెన్రీ.. నెల రోజులపాటు దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించారు. హైతీకి సాయం అందించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారులను ఆదేశించారు. కాగా, 2010లో ఇక్కడ సంభవించిన భారీ భూకంపంలో 2 లక్షల మందికిపైగా మృతి చెందారు.