India: లార్డ్స్ లో రెండో రోజు ఆట ప్రారంభం... వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత్

India lost two early wickets on day two at Lords
  • భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
  • తొలిరోజు భారత్ 276/3
  • కేఎల్ రాహుల్ సెంచరీ
  • రెండో రోజు తొలి ఓవర్లోనే రాహుల్ అవుట్
  • కాసేపటికే వెనుదిరిగిన రహానే
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండోరోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 276-3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలిరోజు సెంచరీ హీరో కేఎల్ రాహుల్ రెండో రోజు ఆటలో తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. తన ఓవర్ నైట్ స్కోరు 127 పరుగులకు మరో 2 పరుగులు జోడించి 129 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ రాబిన్సన్ ఖాతాలో చేరింది.

ఆ తర్వాత అజింక్యా రహానే కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆండర్సన్ బౌలింగ్ లో స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 96 ఓవర్లలో 5 వికెట్లకు 287 పరుగులు. క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. కాగా, రెండో రోజు ఆట సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కు మద్దతుగా ఎర్ర టోపీలు ధరించారు.
India
Lord's
England
KL Rahul

More Telugu News