Ram Nath Kovind: ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

President of India gives nod for AP SC Commission Bill and State Electricity Duty Bill
  • ఎస్సీ కమిషన్, విద్యుత్ డ్యూటీ సవరణ బిల్లులకు ఆమోదం
  • ఇక ఏపీలో ఎస్సీలకు ప్రత్యేకంగా కమిషన్
  • గతంలో బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
  • ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు
ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులు చట్టంగా మారేందుకు మార్గం సుగమం అయింది. ఏపీ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఏపీలో ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతి దిశగా మరింత మెరుగైన కార్యాచరణ కోసం ఏపీ సర్కారు ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు తీసుకురావాలని సంకల్పించింది. ఆ దిశగా బిల్లు తీసుకురాగా, 2020లో ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందింది.

అయితే, ఈ బిల్లుకు శాసనమండలి కొన్ని సిఫారసులు చేయగా, ఆ సిఫారసులు ఆమోదయోగ్యం కాదంటూ ఆ బిల్లును అసెంబ్లీ మరోసారి ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇప్పుడీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో ఎస్సీలకు ప్రత్యేక కమిషన్ రానుంది. రాష్ట్రపతి నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహంలేదు.
Ram Nath Kovind
AP SC Commission Bill
Electricity Duty Bill
Andhra Pradesh

More Telugu News