Revanth Reddy: రేవంత్ మాటలకు తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు: ఎమ్మెల్యే సైదిరెడ్డి

Telangana people are anger at Revanth Reddy comments says TRS MLA Saidireddy
  • పగ, ప్రతీకారాలతో రేవంత్ రాజకీయం చేస్తున్నారు
  • కేసీఆర్ మాకు సంస్కారం నేర్పారు
  • లక్ష మందితో సభ పెట్టే సత్తా నాకు ఉంది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారాలతో రాజకీయం చేస్తున్నారని... తాము కూడా అలాంటి రాజకీయాలనే చేస్తే ఆయన రోడ్డుపై తిరగ్గలడా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని... ఆయన మాటలకు తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియాగాంధీని బలిదేవత అన్నారని... ఇప్పుడేమో మహా దేవత అంటున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ కంటే ఎక్కువగా తాము మాట్లాడగలమని... అయితే తమ అధినేత కేసీఆర్ తమకు సంస్కారం నేర్పారని సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ లో లక్ష మందితో సభ పెట్టే సత్తా తనకు ఉందని... రేవంత్ రెడ్డి నిర్వహించిన ఇంద్రవెల్లి సభ తమకు ఒక లెక్కా? అని వ్యాఖ్యానించారు. రేవంత్ తనను తాను హైలైట్ చేసుకోవడానికే సభ పెట్టినట్టు ఉందని చెప్పారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కాగానే... కాంగ్రెస్ లోని సీనియర్ నేతలందరూ బాధపడిపోతున్నారని అన్నారు.
Revanth Reddy
Congress
TRS
Sonia Gandhi
KCR
Saidireddy

More Telugu News