shimbu: సినీ నటుడు శింబుపై ఆర్కే సెల్వమణి ఆరోప‌ణ‌లు

selvamani slams shimbu
  • తమిళ నిర్మాతల మండలికి, ఫెఫ్సీకి మధ్య విభేదాలు
  • శింబునే కారణమన్న సెల్వమ‌ణి
  • శింబుకు ఎలాంటి సహకారం అందించలేద‌ని వివ‌ర‌ణ
సినీ నటుడు శింబుపై దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ)  అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. తమిళ నిర్మాతల మండలికి, ఫెఫ్సీకి మధ్య త‌లెత్తిన‌ సమస్యకు శింబునే కారణమని చెప్పారు. దీంతో శింబు నటిస్తున్న 4 చిత్రాలకు నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు తాము కూడా ఎలాంటి సహకారం అందించలేదన్నారు.

అయితే, అంత‌కుముందు నిర్మాతల మండలి అనుమతితోనే ఫెఫ్సీ కార్మికులు శింబు న‌టిస్తోన్న ఓ సినిమాకు పని చేశారని చెప్పారు. శింబు హీరోగా ఐసరిగణేశ్‌ నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో నాలుగు రోజులు అనుమతి ఇవ్వాలని కోరారని, నిర్మాతల మండలి అనుమతితోనే దానికి పనిచేశారని చెప్పారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

కాగా, శింబు న‌టించిన‌ ‘అన్బానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌’ సినిమా వ‌ల్ల‌ నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌కు తీవ్ర న‌ష్టం వ‌చ్చింది. శింబు తీరు వ‌ల్లే తాను నష్టపోయానని, పరిహారం చెల్లించాలని రాయప్పన్‌ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయ‌డంతో రాయప్పన్‌కు శింబు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు.

లేదంటే ఆయన నటిస్తున్న సినిమాల‌కు ఎలాంటి సహకారం అందించబోమని ఇటీవ‌లే ప్రకటించారు. అయినప్ప‌టికీ శింబు సినిమాల‌కు ఫెఫ్సీ కార్మికులు పని చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్యవహారంతో ఫెఫ్సీ, నిర్మాతల మండలి మధ్య సమస్యలు తలెత్తాయి.
shimbu
rk
Tamilnadu

More Telugu News