Meera Mithun: ద‌ళిత దర్శకులు, నటీనటులను సినీ పరిశ్రమ నుంచి తరిమేయాలి: మీరా మిథున్

Dalit directors and actors should be sent out of film industry says Meera Muthun
  • షెడ్యూల్డ్ కులాల వారి వల్ల నాకు అవకాశాలు రావడం లేదు
  • వారి పద్ధతులు బాగుండవు
  • నేరాలతో కూడా వారికి సంబంధాలు ఉంటాయి
దళితులను ఉద్దేశించి సినీ హీరోయిన్ మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్లే తనకు మంచి అవకాశాలు రావడం లేదని... వీరిని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారి పద్ధతులు బాగుండవని... అనేక నేరాలతో కూడా వారికి సంబంధాలు ఉంటాయని వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మీరాపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయడంతో... ఆమెపై కేసులు నమోదయ్యాయి. మీరా మిథున్ కు వివాదాలు కొత్తేమీ కాదు. పలువురు స్టార్స్ ని టార్గెట్ చేస్తూ, ఆమె చేసిన కామెంట్స్ గతంలో వివాదాస్పదమయ్యాయి. తాజాగా దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లోకి నెట్టేశాయి.
Meera Mithun
Kollywood
Dalits

More Telugu News