: వివేకవంతులకే వేగమెక్కువట!
తెలివితేటలు ఎక్కువగా ఉండే వారికే చురుకుదనం ఎక్కువని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. మిగిలిన వారితో పోల్చి చూస్తే వివేకవంతుల దృష్టిని ఇతర విషయాలపైకి మళ్లించడం అంత తేలిక కాదని, వీరు ఇతరులకన్నా చురుగ్గా ఆలోచించి వ్యవహరిస్తారని ఈ పరిశోధన నిర్వహించిన రొచెస్టెర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డ్యూజెటాడిన్ అంటున్నారు. వీరు చిన్న పరిమాణంలో సైతం కదిలే వస్తువులను ఇట్టే గుర్తు పట్టగలుగుతున్నారని, ఇలాంటి విషయాల్లో వారి మెదడు అత్యంత వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఐక్యూ ఎక్కువగా ఉన్న వారి మెదడు సహజంగానే భిన్నంగా ఉంటుందని టాడిన్ తెలిపారు. అ అధ్యయనంలో రకరకాల పరిమాణంలోని వస్తువులను, అటూ ఇటూ కదిలే దృశ్యాలను పలువురికి చూపించారు. వారిలో ఐక్యూ ఎక్కువగా ఉన్నవారు చిన్న పరిమాణంలోని వస్తువుల కదలికలను త్వరగా గుర్తు పట్టేశారు. పెద్ద వస్తువులను గమనించడంలో మాత్రం వారికి ఎక్కువ సమయం పట్టింది. చిన్న వస్తువులను త్వరగా గుర్తించడం అనేది వారికి సహజమని, ఇందులో వారు ప్రత్యేకంగా చేసిన ప్రయత్నం అంటూ ఏమీ లేదని, అయితే కళ్లముందు కదిలే భారీ వస్తువులను, వాటి వెనుక నేపధ్య దృశ్యాలను గుర్తించడంలో మాత్రం వారికి ఇబ్బందులున్నాయని టాడిన్ చెబుతున్నారు.