Draw: వర్షం దెబ్బ... టీమిండియా, ఇంగ్లండ్ తొలి టెస్టు డ్రా

First test between Team India and England ended as draw after rain played spoil sport on final day
  • ఆఖరిరోజున వరుణుడి జోరు
  • ప్రారంభం కాని ఆట
  • మ్యాచ్ డ్రా అయినట్టు ప్రకటించిన అంపైర్లు
  • ఈ నెల 12 నుంచి రెండో టెస్టు
టీమిండియా గెలవాల్సిన మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఇంగ్లండ్ తో తొలి టెస్టులో విజయానికి టీమిండియా 157 పరుగులు చేయాల్సి ఉండగా, చివరి రోజు వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. పదే పదే వర్షం పడుతుండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఐదు టెస్టుల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ నిరాశాజనకంగా ముగిసింది.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 303 పరుగులు చేసిన ఇంగ్లండ్... భారత్ ముందు 209 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట చివరికి 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన కోహ్లీ సేన పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఆటకు చివరిరోజైన ఆదివారం వరుణుడు ప్రతాపం చూపించాడు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ నెల 12 నుంచి జరగనుంది.
Draw
First Test
Nottingham
Team India
England

More Telugu News