Revanth Reddy: అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటున్నాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy comments on TRS Govt
  • ఉప ఎన్నికలో లబ్దికోసమే దళితబంధు అని వ్యాఖ్యలు
  • ఉపఎన్నికలు జరిగితేనే పథకాలు వస్తాయని వ్యంగ్యం
  • రేపటి సభను విజయవంతం చేస్తామని ధీమా
  • వచ్చే నెలలో రాహుల్ వస్తున్నాడని వెల్లడి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై మరోమారు ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే దళిత బంధు పథకం తీసుకొస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే... పథకాలు రావాలంటే ఉప ఎన్నికలు జరగాలన్నట్టుగా ఉందని విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయాలంటున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే, అప్పుడైనా పథకాలు వస్తాయేమోనని వ్యాఖ్యానించారు. ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక, రేపు ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభను విజయవంతం చేస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు.
Revanth Reddy
TRS MLAs
Schemes
By Elections
Congress
Telangana

More Telugu News