Rain: నాటింగ్ హామ్ టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభానికి వరుణుడు అడ్డంకి

  • వర్షంతో చిత్తడిగా మారిన ట్రెంట్ బ్రిడ్జ్
  • భారత్ లక్ష్యం 209 పరుగులు
  • ప్రస్తుతం భారత్ స్కోరు 52/1
  • ఇంకో 157 పరుగులు చేస్తే విజయం
 Rain delayed start of fifth day in Nottingham test

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాటింగ్ హామ్ లో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఆటకు నేడు ఐదో రోజు కాగా, వర్షంతో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. దాంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది.

ఈ టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారత్ కు 209 పరుగుల లక్ష్యం నిర్దేశించగా, నాలుగో రోజు ఆట చివరికి భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇంకా 157 పరుగులు చేస్తే విజయం టీమిండియానే వరిస్తుంది. అయితే, పిచ్ స్వింగ్ కు విశేషంగా సహకరిస్తున్న నేపథ్యంలో, ఆటకు చివరిరోజున భారత బ్యాట్స్ మెన్ కు సవాల్ తప్పదనిపిస్తోంది.

ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రూట్ సెంచరీ సాయంతో 303 పరుగులు నమోదు చేసింది.

More Telugu News