TTD: టీటీడీ చైర్మన్​ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డే

AP Govt Once Again Appoints YV Subba Reddy As TTD Chairman
  • ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
  • వేరే వారిని నియమిస్తారన్న ఊహలకు బ్రేక్
  • త్వరలోనే బోర్డు సభ్యుల నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఇటీవల ఆయన పదవీ కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ బాధ్యతలను మరోసారి ఆయనకే అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన పదవీ కాలం పూర్తయ్యాక వేరే వ్యక్తిని నియమించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సుబ్బారెడ్డికే ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.
TTD
YV Subba Reddy
Andhra Pradesh

More Telugu News