PM Modi: నీరజ్ చోప్రాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోదీ

PM Modi talked and appreciated gold winner Neeraj Chopra
  • టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
  • జావెలిన్ త్రోలో అద్భుత ప్రదర్శన
  • ఉప్పొంగిపోయిన యావత్ భారతావని
  • విశ్వరూపం ప్రదర్శించాడన్న మోదీ

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి స్వర్ణం, ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ ఈవెంట్లలో దేశానికి తొలి స్వర్ణం నీరజ్ చోప్రా ఘనత వల్ల సాధ్యమైంది. తన అద్వితీయ ప్రదర్శనతో దేశాన్ని గర్వించేలా చేసిన ఈ యువ అథ్లెట్ ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.

"ఇప్పుడే నీరజ్ చోప్రాతో మాట్లాడాను. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలిచినందుకు అభినందించాను. అతడి కఠోర శ్రమ, దృఢచిత్తాన్ని మెచ్చుకున్నాను. టోక్యో ఒలింపిక్స్ లో చోప్రా విశ్వరూపం ప్రదర్శించాడు. అత్యున్నత క్రీడానైపుణ్యానికి, క్రీడాకారుడి స్ఫూర్తికి ప్రతిరూపంలా దర్శనమిచ్చాడు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని వివరించారు.

  • Loading...

More Telugu News