Ramcharan: రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సన్నివేశం... వీడియో ఇదిగో!

Chilling moments between Ram Charan and NTR in shot gap
  • ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న చరణ్, ఎన్టీఆర్
  • ఉక్రెయిన్ లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్
  • షాట్ గ్యాప్ లో ఉల్లాసంగా అగ్రహీరోలు
  • సందడి చేస్తున్న వీడియో
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కాగా, షాట్ గ్యాప్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఉన్నప్పటి ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఓ రెయిలింగ్ పై కూర్చుని ఉండగా, రాజమౌళి ఓ బొమ్మ కెమెరాతో షూట్ చేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
Ramcharan
Junior NTR
RRR
Rajamouli
Tollywood

More Telugu News