Alisha: దాచేపల్లిలో అలీషా కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నాయకులు

TDP Leaders visits Alisha family at Dachepalli
  • గుంటూరు జిల్లాలో అలీషా అనే వ్యక్తి మృతి
  • ఎక్సైజ్ పోలీసులు కొట్టిచంపారంటున్న టీడీపీ నేతలు
  • దాచేపల్లి వచ్చిన నక్కా ఆనంద్ బాబు తదితరులు
  • అలీషా చిత్రపటానికి నివాళులు
గుంటూరు జిల్లాలో అక్రమంగా మద్యం రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలీషా అనే వ్యక్తి మృతి చెందడంపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్సైజ్ పోలీసుల దాడిలోనే అలీషా మృతి చెందాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు గుంటూరు జిల్లా దాచేపల్లిలో పర్యటించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ మైనారిటీ నేతలు అలీషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలీషా చిత్ర పటానికి నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులు నివాళులు అర్పించారు. అలీషా కుటుంబానికి ధైర్యం చెప్పారు.

కాగా, దాచేపల్లిలోని అలీషా ఇంటివద్దకు మైనారిటీలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ సీఐ కొండారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Alisha
Death
Dachepalli
TDP
Guntur District

More Telugu News