Amitabh Bachchan: అమితాబ్‌ బచ్చన్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

bomb threat call in mumbai
  • గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బెదిరింపు కాల్
  • విస్తృత త‌నిఖీలు
  • న‌కిలీ కాల్‌గా తేల్చిన పోలీసులు
ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు గ‌త రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసంతో పాటు, ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టిన‌ట్లు చెప్పాడు. దీంతో వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగారు. అమితాబ్ నివాసంతో పాటు రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచి, ఆయా ప్రాంతాల్లో త‌నిఖీలు చేశారు.

బాంబులు ఏవీ లభించలేదు. దాంతో అది నకిలీ బెదిరింపు కాల్‌ అని తేలింది. అయిన‌ప్ప‌టికీ ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కాల్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఆగ‌స్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్రాంతాల్లో పోలీసులు భ‌ద్ర‌త‌ను పెంచారు.
Amitabh Bachchan
Bollywood
India

More Telugu News