Uttar Pradesh: క్యాబ్​ డ్రైవర్​ పై దాడి చేసిన యువతికి సంబంధించిన మరో వీడియో హల్​ చల్​.. ఈసారి గేటుకు నల్ల రంగు ఎందుకు వేశారంటూ నానా రభస!

Young Lady Creates Ruckus Over Black Color On The Gate
  • రెండేళ్ల కిందటి వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్
  • అర్ధరాత్రి ఇంటి ముందు గొడవ
  • డ్రోన్ల దాడి జరుగుతుందంటూ రభస
  • పోలీసులు నచ్చజెప్పినా వినని యువతి
ఇటీవల యూపీలోని లక్నోలో తనను ఢీకొట్టాడంటూ ఓ క్యాబ్ డ్రైవర్ పై ప్రియదర్శిని యాదవ్ అనే యువతి దాడికి పాల్పడిన ఘటన గుర్తుందా? క్యాబ్ డ్రైవర్ ను పట్టుకుని ఎడాపెడా బాదేసింది. దీనిపై నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు కూడా. తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. రెండేళ్ల కిందటి ఆ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆమె ఉంటున్న ఏరియాలోని ఓ గేటుకు నల్ల రంగు వేశారని కాలనీ వాసితో గొడవకు దిగింది. గేటుకు నల్ల రంగు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని వల్ల కాలనీ మొత్తాన్ని ప్రమాదంలో పడేస్తారని అరిచింది. డ్రోన్లు వచ్చి దాడి చేస్తాయని గగ్గోలు పెట్టింది. అలా ఆమె అర్ధరాత్రి నడివీధిలోకి వచ్చి గొడవకు దిగడంతో కాలనీలో గందరగోళం ఏర్పడింది. పోలీసులొచ్చి నచ్చజెప్పినా ప్రియదర్శిని ఎంతకూ వెనక్కు తగ్గలేదు. గేటుకున్న నల్ల రంగును తొలగించాల్సిందేనంటూ పట్టుబట్టి కూర్చుంది. ఆ తర్వాత ఎలాగోలా ఆమెను అక్కడ్నుంచి పంపించి వేశారు.

రెండేళ్ల కిందటి వీడియోనే అయినా.. ఇటీవలి క్యాబ్ డ్రైవర్ పై దాడి నేపథ్యంలో అది వైరల్ అవుతోంది. గేటుకు నల్లరంగు వేస్తే తప్పేంటి..? నీ ఒంటి మీద కూడా నల్ల రంగు వస్త్రాలే కదా ఉన్నాయి? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Uttar Pradesh
Girl
Black Colour
House Gate

More Telugu News