అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరే!: మోత్కుపల్లి నర్సింహులు
- దళిత బంధు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్
- వాసాలమర్రి నుంచి అమలు
- హర్షం వ్యక్తం చేసిన మోత్కుపల్లి
- దళిత బంధు పథకాన్ని ఆపడానికి చాలామంది కుట్ర చేస్తున్నారన్న మోత్కుపల్లి
దళిత బంధు పథకాన్ని ఎలా ఆపాలా అని చాలామంది చూస్తున్నారని, కుట్ర చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగలవా? అని ప్రశ్నించారు. అన్ని పార్టీలు దళితులను దళితులుగా చూశాయే తప్ప, ఇలా దళితుల ఖాతాల్లో నేరుగా రూ.10 లక్షలు వేయడం ఎక్కడా చూడలేదని వివరించారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరేనని పేర్కొన్నారు.