Bengaluru: బెంగళూరును బెంబేలెత్తిస్తున్న కరోనా కేసులు

Bengalu registers highest corona cases
  • 24 గంటల్లో కర్ణాటకలో 1,674 కేసుల నమోదు
  • బెంగళూరులో 477 కేసులు
  • నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,986
కర్ణాటకలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా రాజధాని బెంగళూరులోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో బెంగళూరులో 477 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో దక్షిణ కన్నడ జిల్లా (307), మైసూరు (147), ఉడుపి (104), హాసన్ (104) ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,674 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,376 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,280 యాక్టివ్ కేసులు ఉండగా... బెంగళూరులో 8,986 కేసులు ఉన్నాయి.
Bengaluru
Corona Virus
Cases

More Telugu News