Andhra Pradesh: గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు.. పడిపోయిన ఏపీ, తెలంగాణ ఆదాయం

GST Income decreased in ap and telangana
  • సగటున 8.3 శాతం తగ్గిన జీఎస్టీ ఆదాయం
  • ఏపీకి రూ. 3.48, తెలంగాణకు 8.72 శాతం తగ్గిన వసూళ్లు
  • రాజ్యసభలో వెల్లడించిన ప్రభుత్వం
గత ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు సగటున 8.3 శాతం తగ్గినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు 3.48 శాతం, తెలంగాణకు 8.72 శాతం వసూళ్లు తగ్గినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఆదాయం రూ. 39,820 కోట్ల నుంచి రూ. 36,346 కోట్లకు పడిపోగా, 2019-20లో రూ. 27,108 కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం  2020-21 నాటికి రూ. 26,163 కోట్లకు తగ్గినట్టు మంత్రి వివరించారు.
 
Andhra Pradesh
Telangana
GST
Rajya Sabha

More Telugu News