తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
- నేను చేసుకోబోయే వాడికి తెలివితేటలుంటే చాలు
- పెళ్లి పనులు మూడు రోజుల్లో ముగిసిపోవాలి
- చెన్నైలో అమ్మ ఉన్న ఇంట్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు
తమ పెళ్లి పనులన్నీ మూడు రోజులలోనే ముగిసిపోవాలని జాన్వీ కపూర్ తెలిపింది. కాప్రి ఐలాండ్ లో ఓ ప్రైవేట్ బోట్ లో తన స్నేహితులతో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. చెన్నైలోని మైలాపూర్ లో అమ్మ నివసించిందని... ఆమె నివసించిన ఇంట్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగాలని చెప్పింది. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది తన కోరికని తెలిపింది. ఏదేమైనప్పటికీ తన తల్లి వైపు నుంచి సంక్రమించిన దక్షిణాది సంప్రదాయాలకు జాన్వీ పెద్దపీట వేస్తుండటం సంతోషకరం.