Electric Vehicles: టెస్లాకు గట్టి షాక్​ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

No Plans To Cut Import Duties On Electric Vehicles Center Clarified
  • విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గించబోమని వెల్లడి
  • పార్లమెంట్ లో వెల్లడించిన కేంద్ర మంత్రి
  • పన్నులను 40 శాతానికి తగ్గించాలన్న మస్క్
టెస్లాకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రతిపాదనలేవీ లేవని తేల్చి చెప్పింది. భారత్ లో టెస్లా ఫ్యాక్టరీని పెట్టేందుకు సిద్ధమైన సంస్థ సీఈవో ఎలాన్ మస్క్.. విద్యుత్ వాహనాలపై పన్నులను తగ్గించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశారు.

అయితే, తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ దానిపై స్పష్టతనిచ్చారు. పన్నులను తగ్గించే ఉద్దేశం లేదని పార్లమెంట్ లో జవాబు చెప్పారు. అయితే, స్థానికంగా ఉన్న విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు దేశంలో విధిస్తున్న పన్నులను తగ్గిస్తామని, చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, విదేశాల నుంచి దిగుమతి అయ్యే వాటిపై పన్నుల్లో ఎలాంటి తగ్గింపూ ఉండదని తెలిపారు.

దిగుమతి సుంకాలను తగ్గిస్తే అతి తక్కువ ధరకు కార్లను భారత్ లో విక్రయిస్తామని గత నెలలో మస్క్ లేఖ రాశారు. ప్రస్తుతం 60 నుంచి 100 శాతం దాకా సుంకాలు విధిస్తున్నారని, వాటిని 40 శాతానికి తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందుగా తమ కార్లను దిగుమతి చేసుకోనిస్తే.. ఆ తర్వాత ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.
Electric Vehicles
Tesla
Elon Musk
Union Government

More Telugu News