Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో యూనియన్ ఆవిర్భావం

New union born in Tollywood
  • పురుడుపోసుకున్న తెలంగాణ మూవీస్, టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్‌ యూనియన్
  • అధ్యక్షురాలిగా వి.కవిత
  • ధ్రువీకరణ పత్రం జారీ చేసిన కార్మిక శాఖ
తెలుగు చిత్రపరిశ్రమలో మరో యూనియన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ మూవీస్, టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ పురుడుపోసుకుంది. ఈ యూనియన్‌కు ఆమోదం తెలిపిన కార్మిక శాఖ తాజాగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ యూనియన్‌కు వి. కవిత అధ్యక్షురాలిగా వ్యవహరించనుండగా, ఎస్‌సీ శేఖర్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు సినీ, టీవీ పరిశ్రమల్లో తెలంగాణ నటీనటులకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ఇంకా ఇలా జరుగుతుండడం బాధాకరమన్నారు. ఇకపై తెలంగాణ సినీ, టీవీ కార్మికులకు అండగా ఉంటామని, అదే లక్ష్యంగా యూనియన్ పనిచేస్తుందని అన్నారు.
Tollywood
TMTDAU
Telangana

More Telugu News