Lalu Prasad Yadav: ములాయంతో లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ

RJD Chief Lalu Yadav met Mulayam Singh
  • జైలు నుంచి విడుదలయ్యాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా మారిన లాలు
  • పలు విషయాలపై సుదీర్ఘ చర్చ
  • దేశానికి సామ్యవాదం అత్యవసరమన్న ఆర్జేడీ చీఫ్

జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో మళ్లీ చురుకుగా పాల్గొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.

భేటీ అనంతరం లాలు ట్వీట్ చేస్తూ.. తన స్నేహితుడు ములాయంను కలిసినట్టు పేర్కొన్నారు. రైతుల ఆందోళనలు, అసమానత్వం, పేదరికం, నిరుద్యోగ సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. దేశానికి సమానత్వం, సామ్యవాదం అత్యవసరమని పేర్కొన్న లాలూ.. పెట్టుబడిదారీ విధానం, వర్గవాదం అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News