Hockey: సెమీస్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. ఇక ‘కాంస్యం’పైనే ఆశలు

tokyo olympics hockey india lost to belgium
  • చేజారిన స్వర్ణం కల
  • ప్రపంచ నంబర్ వన్ బెల్జియం చేతిలో 5-2తో ఓటమి
  • చివర్లో గోల్స్ సమర్పించుకున్న మన్‌ప్రీత్ సేన
టోక్యో ఒలింపిక్స్ హాకీలో అద్భుత ఆటతీరుతో తొలి నుంచి ఆకట్టుకున్న భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో బోల్తాపడింది. కొద్దిసేపటి క్రితం జరిగిన సెమీస్ పోరులో ప్రపంచ నంబర్ వన్ అయిన బెల్జియం చేతిలో  5-2తో ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్లలోనూ 2-1తో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన మన్‌ప్రీత్ సేన చివరి క్వార్టర్‌లో చేతులెత్తేసింది. బెల్జియం ఆటగాళ్లను డిఫెండ్ చేసుకోలేక వరుస గోల్స్ సమర్పించుకుని ఓటమి పాలయ్యారు. అయితే, భారత జట్టు స్వర్ణం, రజతం ఆశలు చేజారినప్పటికీ కాంస్య పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి.
Hockey
India
Tokyo Olympics

More Telugu News