'సాహో' దర్శకుడితో చరణ్!
- సుజీత్ వినిపించిన కథ
- చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్
- శంకర్ సినిమా తరువాత సెట్స్ పైకి
- అధికారికంగా రావలసిన స్పష్టత
భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా పరాజయం పాలైంది. ప్రభాస్ అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశ పరిచింది. దాంతో అప్పటి నుంచి సుజీత్ మరో సినిమా చేయలేకపోయాడు. 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలను సుజీత్ కి అప్పగించే ప్రయత్నాలు జరిగాయి. కానీ చివరి నిమిషంలో చరణ్ మనసు మార్చుకున్నాడు.
అయితే ఓ మంచి కథను తయారు చేసుకుని వస్తే తాను చేస్తానని ఆ సమయంలో సుజీత్ కి చరణ్ మాట ఇచ్చాడట. రీసెంట్ గా సుజీత్ కథ వినిపించడం .. చరణ్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.