East Godavari District: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భార్యాభర్తలు

Family suicide by jumping into river in east godavari
  • మామిడికుదురు మండలంలో ఘటన
  • బ్రిడ్జిపై నుంచి వశిష్ఠ నదిలోకి దూకిన కుటుంబం
  • మోసం, వేధింపులు భరించలేకేనంటూ లేఖ, ఆడియో
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని మామిడికుదురు మండలం మొగలికుదురులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బైక్‌పై చంచినాడ బ్రిడ్జి వద్దకు చేరుకున్న దంపతులు దాని పైనుంచి పిల్లలతో సహా వశిష్ఠ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రిడ్జిపై ఉన్న బైక్, చిన్నారుల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, కొందరు వ్యక్తులు తమను దారుణంగా మోసం చేశారని, వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్య పేరుతో ఉన్న లేఖ, ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

East Godavari District
Family
Suicide

More Telugu News