TS High Court: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే కోర్టు హాల్లోకి అనుమతి: తెలంగాణ హైకోర్టు

Telangana high court issues new guidelines for hearings

  • ఇంకా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • తాజా మార్గదర్శకాలు వెల్లడించిన హైకోర్టు
  • ఆగస్టు 9 నుంచి ప్రత్యక్ష విచారణ
  • అయితే అది పాక్షికమేనని హైకోర్టు వివరణ

కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బంది కరోనా నియామవళి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కోర్టులు, ట్రైబ్యునళ్లకు తెలంగాణ హైకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆగస్టు 9 నుంచి పలు కేసుల ప్రత్యక్ష విచారణ చేపడుతున్నట్టు వెల్లడించింది. అయితే ఇది పాక్షికమేనని, సెప్టెంబరు 9 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. అది కూడా రోజుకొక ధర్మాసనం, ఇక సింగిల్ బెంచ్ కు ప్రత్యక్ష విచారణ అవకాశం కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆగస్టు 8 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కోర్టుల్లో ఆన్ లైన్ లో విచారణ ఉంటుందని వివరించింది.

TS High Court
Guidelines
Hearings
Advocates
Telangana
Corona Pandemic
  • Loading...

More Telugu News