Ramappa Temple: వందేళ్ల క్రితం నాటి రామప్ప దేవాలయం.. సోషల్​ మీడియాలో ఫొటో చక్కర్లు!

Old Photo Of Ramappa Viral In Social Media
  • వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన వ్యక్తి
  • పురాతత్వ శాఖ ఉద్యోగిగా గుర్తింపు
  • 1922లో తీసిన ఫొటో అని వెల్లడి
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఇటీవలే  ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రక సంపదగా రామప్ప రికార్డులకెక్కింది. ఇప్పుడు అందరి నోటా అదే మాట.

అయితే, తాజాగా 1922 నాటిదని చెబుతున్న రామప్ప గుడి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకటాపురం (ఎం) మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూప్ లో ఆ ఫొటోను షేర్ చేశాడు. ఆ తర్వాత దానిని డిలీట్ చేశాడు. అప్పటికే చాలా మంది దానిని ఫార్వర్డ్ చేశారు. ఆ వ్యక్తి పురాతత్వశాఖలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వందేళ్ల క్రితం 1922లో ఆ ఫొటోను తీశారని అతడు పేర్కొన్నాడు. మిగతా వివరాలేవీ చెప్పలేదు.

Ramappa Temple
Telangana
Mulugu
Warangal

More Telugu News