కూలిన జైలు గోడ.. 22 మంది ఖైదీలకు తీవ్ర గాయాలు
- మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా జైల్లో ఘటన
- తెల్లవారుజామున కూలిన బ్యారక్ గోడ
- తీవ్రంగా గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స
తీవ్రంగా గాయపడిన ఖైదీలు గ్వాలియర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. స్వల్పంగా గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ జైలు భవనం పురాతనమైనది. దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో గోడ బాగా నానిపోయి కూలిపోయింది. ఈ జైల్లో ప్రస్తుతం 255 మంది ఖైదీలు ఉన్నారు.