Devineni Uma: దేవినేని ఉమ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. కుటుంబ సభ్యులకు పరామర్శ

Chandrababu reaches Devineni Uma residence
  • రాజమండ్రి జైల్లో ఉన్న దేవినేని ఉమ
  • కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు
  • పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ కార్యకర్తలు
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నివాసానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఉమ నివాసం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చంద్రబాబు రాక సందర్భంగా ఉమ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.

మరోవైపు ఉమ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దేవినేని ఉమ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు కుట్ర, హత్యాయత్నం సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తుండగా జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు.
Devineni Uma
Chandrababu
Telugudesam

More Telugu News