International Flights: థర్డ్ వేవ్ భయాలు... అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

Govt extends ban on international passenger flights
  • మళ్లీ క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • కొన్ని దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని వార్తలు
  • ఆగస్ట్ 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన ప్రభుత్వం
ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలను... ధర్డ్ వేవ్ భయాలు వణికిస్తున్నాయి. పలు దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమయిందనే వార్తలు వస్తున్నాయి. మన దేశంలో సైతం క్రమంగా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీసీఏ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం 2021 ఆగస్ట్ 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో డీజీసీఏ పేర్కొంది. ఈ నిషేధం కార్గో (రవాణా) విమానాలకు వర్తించదని తెలిపింది. అయితే కొన్ని సెలెక్ట్ చేసిన రూట్లలో అవసరాలను బట్టి కేస్ టు కేస్ బేసిస్ కింద అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలను అనుమతిస్తామని వెల్లడించింది.
International Flights
Ban
India
DGCA

More Telugu News