వ్యవసాయ బావిలో పడిపోయిన కారు.. అందులో ఐదుగురు?
- కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరులో ఘటన
- గుర్తించిన స్థానికులు
- కారును బయటకు తీసేందుకు పోలీసుల ప్రయత్నాలు
కరీంనగర్ నుండి కారు హుస్నాబాద్ వెళ్తుండగా చిన్న ముల్కనూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. ఆ కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు బావిలో పడి అప్పటికే చాలా సమయం కావడంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.