Narendra Modi: కృష్ణ‌ జింక‌లు పరుగులు తీస్తున్న సుందర దృశ్యం.. వీడియోను షేర్ చేసిన ప్ర‌ధాని మోదీ!

modi shares interesting video
  • గుజ‌రాత్‌లో భావ్‌నగర్‌లో ఘ‌ట‌న‌
  • ఒక‌దాని వెనుక మ‌రొక కృష్ణ జింక ప‌రుగులు
  • భావ్‌నగర్‌లోని  జాతీయ పార్కులో  కృష్ణజింకల ప‌రిర‌క్ష‌ణ‌
గుజరాత్ లో దాదాపు 3,000కు పైగా కృష్ణ‌ జింక‌లు ప‌రుగులు తీస్తూ క‌నువిందు చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పోస్ట్ చేసి అద్భుతం అని పేర్కొన్నారు. భావ్‌నగర్‌లోని కృష్ణజింకల జాతీయ పార్కులో మూడువేల కృష్ణ‌ జింకలు ఒకదాని వెనుక ఒక‌టి రోడ్డు దాటుతుండ‌గా కొంద‌రు ఈ వీడియో తీశారు. ఈ వీడియోను గుజ‌రాత్ స‌మాచార శాఖ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది.

ఆ ట్వీట్‌నే ప్రధాని మోదీ రీ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోను మోదీ షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే  వైర‌ల్ అయింది. ల‌క్ష‌లాది వ్యూస్ వ‌స్తున్నాయి. వేలాది మంది రీట్వీట్లు చేస్తున్నారు. కృష్ణ జింక‌ల‌ను ఇంత‌టి భారీ సంఖ్య‌లో తొలిసారి చూస్తున్నారమ‌ని కామెంట్లు చేస్తున్నారు. కృష్ణ జింక‌ల‌ను ప‌రిర‌క్షిస్తోన్న ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.
Narendra Modi
BJP
Viral Videos

More Telugu News