Weightage Marks: ఈఏపీ సెట్ లో ఇంటర్ వెయిటేజి మార్కుల తొలగింపు
- ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి
- కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు
- ఎంట్రన్స్ టెస్టు మార్కుల ఆధారంగానే ఈసారి ప్రవేశాలు
- ఉన్నత విద్యామండలి ప్రకటన
ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్ (గతంలో ఎంసెట్) అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏపీ సెట్ లో ఇంటర్ వెయిటేజి మార్కులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఇస్తున్నారు. ఇకపై అది వర్తించబోదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఈ ఏడాది ఈఏపీ సెట్ ద్వారా ప్రవేశాలు పూర్తిగా రాత పరీక్ష మార్కుల ఆధారంగానే జరుగుతాయని వెల్లడించింది.