Amitabh Bachchan: హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ అమితాబ్‌, నాగార్జున‌.. వీడియోలు ఇవిగో

big b priticipates in green india challenge
  • ఎంపీ సంతోష్‌తో క‌లిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌
  • రామోజీ ఫిల్మ్ సిటీలో కార్య‌క్ర‌మం
  • షూటింగ్ కోసం వ‌చ్చిన అమితాబ్
హైదరాబాద్‌లో సినీన‌టులు అమితాబ్ బ‌చ్చ‌న్, నాగార్జున‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు అమితాబ్ హాజ‌ర‌య్యారు.

ఈ విష‌యం తెలుసుకున్న సంతోష్ కుమార్ వారి వ‌ద్ద‌కు వెళ్లి వారితో మొక్క‌లు నాటించి ఫొటోలు తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్ ఓ మొక్క‌ను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అమితాబ్‌కు సంతోష్ కుమార్ వివరించారు. మంచి కార్యక్రమం చేపట్టారని సంతోష్‌ను అమితాబ్‌ ప్రశంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి కూడా పాల్గొన్నారు.

కాగా, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. సంతోష్ కుమార్ ఇప్ప‌టివ‌ర‌కు 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని కొనియాడారు.
Amitabh Bachchan
TRS
Nagarjuna
Green India Challenge

More Telugu News