NIshiya Momiji: ఒలింపిక్స్ రికార్డు బద్దలు కొట్టిన 13 ఏళ్ల జపాన్ బాలిక

Japan teenage girl Nishiya Momiji set new Olympic record
  • టోక్యో ఒలింపిక్స్ ద్వారా స్కేట్ బోర్డ్ క్రీడాంశం అరంగేట్రం
  • స్వర్ణం గెలిచిన నిషియా మోమిజి
  • రన్ అండ్ ట్రిక్ ఈవెంట్లో అద్భుత ప్రతిభ
  • ఇదే ఈవెంట్లో కాంస్యం కూడా జపాన్ సొంతం
టోక్యో ఒలింపిక్స్ ద్వారా స్కేట్ బోర్డ్ క్రీడాంశం అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో జపాన్ టీనేజి అమ్మాయి నిషియా మోమిజి స్కేట్ బోర్డ్ క్రీడలో ఒలింపిక్స్ రికార్డు బద్దలు కొట్టడం విశేషం. మోమిజి వయసు కేవలం 13 సంవత్సరాల 330 రోజులు.

రన్ అండ్ ట్రిక్ ఈవెంట్ లో అద్భుతమైన ప్రతిభ చూపిన మోమిజి అత్యంత పిన్న వయసులో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. జపాన్ లో ఇప్పుడు మోమిజి పేరు మార్మోగుతోంది. ఈ క్రీడాంశంలో బ్రెజిల్ అమ్మాయి 13 ఏళ్ల లియాల్ రేసా రజతం అందుకోగా, జపాన్ కు చెందిన నకయామా ఫనా కాంస్యం దక్కించుకుంది.
NIshiya Momiji
Olympic Record
Skate Board
Tokyo Olympis
Japan

More Telugu News