Talasani: కొందరు నిన్న అమ్మవారిని దర్శించుకుని, రాజకీయాలు మాట్లాడారు: తలసాని అసంతృప్తి

Few leaders spoke about politics after having Godess darshan says Talasani
  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరిగాయి
  • జాతరను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించుకున్నాం
  • ఈ ఏడాది వర్షాలతో జాతర ప్రారంభమైంది
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ రోజు రంగం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, బోనాల సందర్భంగా అమ్మవారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. ఫలహారం, బండిల ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగిందని అన్నారు. బోనాల జాతరను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించుకున్నామని... దీనికి సహకరించిన ఆలయ కమిటీకి, స్వచ్చంద సంస్థలకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.

సాధారణంగా వర్షాలు కురవాలని అమ్మవారికి మొక్కుకుంటామని... కానీ, ఈ ఏడాది వర్షాలతో జాతర ప్రారంభమైందని తలసాని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులు నిన్న అమ్మవారిని దర్శించుకున్నారని, ఆ తర్వాత మీడియా పాయింట్ లో రాజకీయాలు మాట్లాడారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారి పేర్లను తాను చెప్పనని, అయితే ఇలాంటి పద్ధతిని మార్చుకోవాలని వారిని తాను కోరుతున్నానని చెప్పారు.
Talasani
TRS
Mahankali Bonalu

More Telugu News