DOST: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువు మరోమారు పెంపు

DOST Registration date extended in Telangana once again
  • ఈ నెల 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ 
  • ఆగస్టు 4న తొలి విడత సీట్ల కేటాయింపు
  • సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్న అధికారులు
తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి పొడిగించిన ‘దోస్త్’ మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోవడంతో గడువును మరోమారు పొడిగించారు. రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్. లింబాద్రి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 1.88 లక్షల మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వచ్చే నెల 4న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆ తర్వాతి రోజు నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 18 వరకు జరుగుతుంది. అదే నెల 25న రెండో విడత సీట్లను కేటాయిస్తారు.
DOST
Degree
Students
Telangana

More Telugu News